ముంబై 24.07.23 : బీఆర్ఎస్ పార్టీ కర్యధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు (కేటీఆర్) గారి జన్మదిన వేడుకలు ముంబై మహానగరంలో ఘనంగా జర్పారు.
ఇటీవల మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఉవ్వెత్తున విస్తారిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుని బర్తడే ప్రజలు మరి ముఖ్యంగా తెలుగు ప్రజలు నిర్వహించడం విశేషాన్ని సంతరించుకుంది.
సోమవారం సాయంత్రం ముంబైలోని కాందివాలి చార్కోప్ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త సుక్క నర్సింహ తన కార్యాలయంలో బిఆర్ఎస్ ముంబై ప్రంతాధ్యక్షులు బద్ధి హేమంత్ కుమార్ సూచన మేరకు ఈ శుభ కార్యం నిర్వహించారు.
బద్ధి హేమంత్ కుమార్, సుక్క నర్సింహ తో సహా ముంబ్ర కల్వ అసెంబ్లీ సమన్వయకర్త దినకొండ సంతోష్, చందివాలి అసెంబ్లీ సమన్వయకర్త చౌవల్ రమేష్, బొరివలి అసెంబ్లీ సమన్వయకర్త ఉప్పు భుమన్న, భివండి సీనియర్ నాయకులు భోగ సుదర్శన్ పద్మశాలి, కిరణ్ రజ్పుత్, సంతోష్ మోరే, సంపత్, సుక్క అశోక్, ముత్తయ్య సింగపంగ, ఉదయ భాను, కొండాపురం బాబు తదితర ముంబైకర్లు కె.టి.ఆర్ గారికి దిల్సె అభివాదాలు తెల్పారు.
- ములనివసి మాల జీ