మణిపూర్ బెడక్ ఘటనల్ని ఖండించిన మహారాష్ట్ర బి.ఆర్.ఎస్

 

థానే 24.07.2023 : మణిపూర్‌లో మే 3న, ఇద్దరు కుకీ గిరిజన మహిళలను నగ్న స్థితిలోఉంచి దారుణంగా కొట్టి మురికివాడల్లో పడేశారు. ఇది ఓ భయానక వాతావరణం సృష్టించబడ్డాయి. ఈ ఘటన జులైలో భారతదేశంలో వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడు నెలలైంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం,  మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అక్కడి పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ఇప్పటి వరకు సుమారు 140 మంది గిరిజనులు చనిపోయారు. అయితే మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరోవైపు ప్రధాని దేశ విదేశాలు తిరుగుతున్నా మణిపూర్ ఎందుకు వెళ్లడం లేదు? ఇప్పటికీ ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి మణిపూర్ సీఎం అసమర్థుడని స్పష్టమవుతోందని బీ.ఆర్.ఎస్ పార్టీ ప్రతినిధులు ఆరోపించారు.

బీజేపీ నేతలు మంత్రులు తప్ప ఈ దేశంలో ఎవరూ సురక్షితంగా లేరన్నారు. అందుకే ఈ ప్రభుత్వాలకు పాలించే నైతిక హక్కును కోల్పోయారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత  హేమంత్‌ కుమార్‌ బద్ది ఆక్రోశించారు.

దీంతో పాటు జిల్లా సాంగ్లీ బెడక్ గ్రామంలో 150 దళిత కుటుంబాలను అణచివేసి బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరుతో ఉన్న తోరణాన్ని (ప్రవేశ ద్వారం) ధ్వంసం చేశారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు విన్నవించినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అందుకే మంత్రివర్గానికి వ్యతిరేకంగా 150 కుటుంబాలు సమ్మెకు దిగాయి. ఎమ్మెల్యే సురేశ్ ఖాడే, సంరక్షక కార్మిక శాఖ మంత్రి పట్టించుకోలేదు.

ఈ రెండు దారుణ ఘటనలను పునరావృతం కాకుండా ఉండడానికి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) థానేలోని కలెక్టర్ కార్యాలయం వద్ద తీవ్ర నిరసనలు చేపట్టింది. ఈ కేసుల్ని "ఫాస్ట్ ట్రాక్ కోర్టు" లో విచారించి దోషులను వెంటనే శిక్షించాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.

ఈ నిరసనలో బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన కొంకణ్ ముంబై డివిజనల్ కోఆర్డినేషన్ ప్రొ. విజయ్ మోహితే తెలిపిన వివరాల ప్రకారం, కొంకణ్ ముంబై ప్రాంతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహేంద్ర కాన్సే, ముంబై  ప్రంతాధ్యక్షులు హేమంత్ కుమార్ బద్ది, సీనియర్ నాయకులు సుదర్శన్ భోగా, కళ్యాణ్ లోక్‌సభ కోఆర్డినేటర్ జయప్రకాష్ పవార్, థానే లోక్‌సభ డిప్యూటీ కోఆర్డినేటర్ ధనాజీ సురోసే, ముంబ్రా కల్వా అసెంబ్లీ కోఆర్డినేటర్ దోనకొండ సంతోష్,  భండుప్ అసెంబ్లీ కోఆర్డినేటర్ అంబటి రాములు, భివండి గ్రామీణ అసెంబ్లీ సమన్వయకర్త డా వినాయక్ వాఖరే, పశ్చిమ భివండి అసెంబ్లీ కోఆర్డినేటర్ సిరిమల్లె  శ్రీనివాస్, తూర్పు భివండి అసెంబ్లీ కోఆర్డినేటర్ సిరిపురం తిరుపతి, మహిళా నాయకులు రజనీ హీలే, మీనా కొండలే, సుశీల కెరే, నీతా నీలే, మందతై కచూరే, ఆశా కొకనే, ఉషా మేఘనే, నిరివిటి డాంగ్లే, పార్టీ కార్యకర్తలు, కార్యాలయ బేరర్‌లతో కల్సి తీవ్ర నిరసన ప్రదర్శన నిర్వహించారు.
- ములనివసి మాల జీ