మంగళవారం 27 డిసెంబర్ 2022 రోజున సాయంత్రం ఆసియాలోని అతిపెద్ద ఓపెన్ ఎయిర్ లాండ్రి ఉన్న మహాలక్ష్మి దోబీ ఘాట్ లో భారత రాష్ట్ర సమితి (భారస) సభ బద్దీ హేమంత్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
భారస ముంబై ప్రాంత అధ్యక్షులు బద్ది హేమంత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ప్రజాస్వామ్యం పతకాలు మానేసి పేశ్వ కాలం భట్జి షెట్జి లకు పతకాలు మొదలు పెట్టాయి. బిఆర్ఎస్ అధినేత దేశ్ కె నేత కేసీఆర్ గారిని ప్రధాన మంత్రి చేస్తేనే దేశం అంతటా తెలంగాణ లాంటి పతకాలు అమలు అవుతాయి. ఈ హక్కులను సాదించేందుకు భారస ద్వారా మనమందరం కల్సి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇదే సభలో భారస ముంబై నాయకులు టీ. నరేష్ రజాక్ "భారస మహాలక్ష్మి శాఖ" ను ప్రారంభించారు. త్వరలో కమిటీకి పదాదికారులను నియమించి తమ పార్టీకి తెలుపనున్నట్లు తెల్పరు.
ఈ భారస మహాలక్ష్మి సభలో సుక్క నర్సింహ, దొనకొండ సంతోష్, ఎలుగు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.