అమ్మనబోలు ను మండలంగా ప్రకటించాలి

 

పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ్ కా నేత గౌ.శ్రీ. కేసీఆర్ గారు చిన్న రాష్ట్రాలు, అందులో చిన్న మండలాలు ఏర్పాట్లు చేసే మహత్తర పనుల్లో ఉన్నారు. అయితే ప్రతిఫలంగా ప్రజల ఆకాంక్ష పెరుతుంది. అందులో భాగంగానే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని అమ్మనబోలు ను మండలంగా ప్రకటించాలని ముంబై వలసజీవులు కోరుచున్నారు.  ఇంచుమించు పదియెను పదహారు గ్రామాలతో చుట్టూ "అమ్మనబోలు" కూడుకొని ఉంది. అట్టి గ్రామాల్లోని ప్రజలకు రవాణా సౌకర్యాలకు, అడ్మినిస్ట్రేషన్ పనులకు సౌలభ్యంగా ఉంది. ఇలాగ నడికేంద్రంలో ఉన్న అమ్మనబోలు గ్రామ ప్రాంతాన్ని మండలంగా ప్రకటించాలని అక్కడి ప్రజలు ధర్నాలు చేస్తున్న విషయం అందరికీ అవగతమే. అట్టి ఆందోళనకు ముంబై వలసజీవులు 100వ. రోజు సంఘీభావం తెలుపుతూ మంగళవారం సాయంత్రం నవీముంబై వాశి గావ్దేవి మైదానంలో నిర్వహించారు. 

భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) ముంబై రిజియన్ నాయకులు బి.హేమంత్ కుమార్ సమక్షంలో ఎలుగు లింగయ్య నాయకత్వంలో జరిగిన సంఘీభావంలో పద్నాలుగు ఊర్లకు సంబంధించిన ముంబైకర్లు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ప్రముఖంగా కన్నెబొయిన పరమేష్, కె. సోమయ్య, ఏ. శంకర్, ముడిదొడ్డి రాజయ్య తదితర్లు పాల్గొన్నారు.

"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """

ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.

గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl 

Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl

Regards

Hemantkumar Baddy - Chief Editor
..........................................☘☘☘