భారస తొలిసభలో ముంబై నేతల హైలాన్
శనివారం 15వ అక్టోబర్ 2022 రోజున సాయంత్రం ముంబై కాందివలిలో ట్రైడెంట్ హై స్కూల్లో భారత రాష్ట్ర సమితి (భారస) తొలి సభ బద్దీ హేమంటకుమార్ అధ్యక్షతన జరిగింది.
సభ ప్రారంభంలో నూతన పార్లమెంట్ భవనానికి భారతరత్న డాక్టర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని తెలంగాణ శాసనసభలో తీర్మానం ఆమోదించి నందుకు, అలాగే తెలంగాణ సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టినందుకు బిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముంబైకర్లు కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు.
భారస ముంబై రీజియన్ నాయకులు హేమంత్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ముద్దుబిడ్డ సాయాజి శీలం గారు మహారాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్ ఎన్నికైయ్యారని, మరో మన తెనుగు/ముదిరాజ్ బిడ్డ పుప్పాల నర్సింగ్ గారు 1954లో ముంబై నగరానికి మేయర్ ఉన్న వైభవశాలి చరిత్రను వివరించారు. ఇంతేగాకుండా ఎందరో మున్సిపల్లో నగరసేవకులుగా ఉండి తమ తెలుగు సత్తాను చాటారని గౌరవంగా పేర్కొన్నారు. అయితే 1970 తరవాత తమ మహారాష్ట్రాలోని ప్రముఖ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలుగువారికి ఎన్నికలో పోటీచేసేందుకు టికెట్ ఇవ్వడం మానేశారని ఆవేదనను వ్యక్తపర్చారు. అయితే ఇప్పుడు తెలుగు ముంబైకర్లు బాధపడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు మన కేసీఆర్ నాయకత్వంలో భారస అన్ని ఎన్నికలో పోటీచేసేందుకు టికెట్ ఇచ్చెందుకు సిద్ధం ఉందని వెల్లడించారు. తిరిగి మన రాజకీయ వైభవాన్ని ముంబై ప్రాంతంలో తెలుగు తేజం వికసించనున్నట్లు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
బారస ఆవిర్భావ సభలో మరో వక్త సుధాకర్ రాజు రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రలో మన మాల మాదిగల వారికి ఎస్సి ఎస్టీ సవరణ ఆర్డర్ 1976 అమలు కావాలని, అలాగే మన పద్మశాలి, మున్నూరు కాపు వారికి ఎస్.బి.సి రిజర్వేషల్లను ఆమలు చేసేందు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు విఫలం అయ్యారని దుయ్యబట్టారు. ఈ హక్కులను సాదించేందుకు భారస ద్వారా మనమందరం కల్సి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇదే సభలో భారస ముంబై నాయకులు సుక్క నర్సింహ "భారస కాందీవలి శాఖ" ను ప్రారంభించారు. త్వరలో కమిటీకి పదాదికారులను నియమించి తమ పార్టీకి తెలుపనున్నట్లు తెల్పరు.
వచ్చే నెలలో మహాలక్ష్మి, ములుండ్, చెంబుర్, వాశి, కల్వా, థానే మొదలగు ఏరియా శాఖల ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నాయని మరో నేత సురేష్ ముదిరాజ్ తెలిపారు.
ఈ భారస ముంబై తొలి సభలో కత్తెర రాములు మహరాజ్, కొడపురం బాబు మహరాజ్, సింగపంగ ముత్తయ్య మహరాజ్, ఎం. దాస్ గౌడ్, సుక్క అశోక్ మహరాజ్ పలువురు పాల్గొన్నారు.
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl
Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl
Regards