★ బుద్ధవినాయక జయంతికి శుభాకాంక్షలు
★ బుద్ధుడే నిజమైన వినాయకుడు !
శనివారం ముంబైలోని పశ్చిమ కుర్లా, తక్షశీల బుద్ధ విహార్ లో నిజమైన బుద్ధ వినాయకుణ్ణి దర్శనం చేసుకొని, బుద్ధవందనం జరుపుకున్నారు. భారతీయ చరిత్రలో గౌతమ బుద్ధుని కి వేయి పేర్లు ఉండేవి, ఆ పేర్లు ప్రజలు పెట్టారు / వారి నానిడి. అందులోని ఒక పేరు వినాయకుడు. అంటే బుద్ధుడు సామాన్య ప్రజలతో వినభ్రంతో, వినయంతో, వినాయకంగా వ్యవహారించే వారని ఆర్థం.
ఈ దేశంలో తిష్ట వేసియున్న విదేశీ ఆర్యులు (చిత్పావన్ బ్రాహ్మణులు - బాల గంగాధర్ తిలక్ లాంటివారు) మన చారిత్రక వ్యక్తులను, ఘట్టాలను తమ వైపు మల్చుకున్నారని ఫూలే అంబేడ్కర్లు ఏనాడో తెల్చేశారు. ఆర్యులు వికృతపర్చిన అశాస్త్రీయ వినాయకుణ్ణి (గణపతిని) పెరియర్ గారు అధికారికంగా ద్వంసం చేసింది తెల్సిందే, అదే అంబేడ్కర్ గారు కూడా 22 ప్రతిజ్ఞ లో వ్యతిరేకించింది కూడా దేశప్రజలకు అవగతమే.
ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ముంబై నాయకులు నాగసేన్ మాల మాట్లాడుతూ మొన్న తెలుగు నేల కు చెందిన ప్రఖ్యాత బుద్ధిస్ట్ పరిశోధకులు డా. బొర్రా గోవర్ధన్ గారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన వ్యాసం దానికి చారిత్రాత్మక నిరూపణ. తిరిగి మన వినాయక బుద్ధుని జయంతి ఉత్సవాలను జరుపుకుందాం. మన ప్రజలకు మన స్వదేశీయ వారసత్వాన్ని, సమతవాదా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందిదాం/ జరుపుకుందాం. ఇట్టి కార్యక్రమాల ద్వారా దేశ ప్రజల్లో సమత, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వాన్ని పెంపొందిదాం అంటూ బహుజన శ్రామిక లోకానికి ఆయన పిలుపునిచ్చారు.
ఈ వేడుకలో ముంబై తెలంగాణ బహుజన ఫోరం కన్వీనర్ మంద రాజు మహారాజ్, బౌద్దాచార్యులు బంతే గురుజీ, రోహిదాస్ కాంబ్లే, సంజయ్ సిర్సాట్ గార్లు ఉన్నారు. అనంతరం, ఉత్సవ నిమిత్తంగా ఈ బుద్ధిస్ట్ కార్యకర్తలు స్థానిక ప్రజలకు మిఠాయిలు పంచారు.
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl
PayTM No : 7977884658
Please Help this Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl
PayTM No : 7977884658
Regards
Hemantkumar Baddy
..........................................☘☘☘