తొలి మలి దశ తెలంగాణ ఉద్యమకారుని మృతి


 


 తొలి దశ 1968 లో, మలి దశ తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న ముంబై వాస్తవ్యులు గజ్జల రాందాస్ పద్మశాలి (91 వయసు) మంగళవారం రాత్రి కిడ్నీ ఫెయిల్ వల్ల పూణే లో మృతి చెందారు. భివండి ముంబైలో రెండో దశ  ఉద్యమం సాగించిన ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎం.టి.జె.ఏ.సి) కి గౌరవ అధ్యక్షుడిగా నాయకత్వం వహించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులైన కె. చంద్రశేఖర్ రావు, ప్రొ. కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, విమలక్క, రసమయి బాలకృష్ణ, దేవి ప్రసాద్, గద్దర్ తదితరులతో ఉద్యమ రీత్యా ముంబై బృందంతో కలవడం అనేవి జరిగాయి.


 


1968 తొలి దశలో బొంబాయి తెలంగాణ సమితి ఏర్పాటు చేసి కార్యదర్శిగా ఏర్గట్ల రత్నం మాల, అధ్యక్షులుగా జి. రాందాస్ పద్మశాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం బ్రహ్మానంద రెడ్డి కి ముంబై ఏర్పోర్టులో భారీ జనంతో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. వర్లీ, దాదర్, పరెల్ తదితర ప్రాంతాల్లో సభలు నిర్వహించారు.


 


రాష్ట్ర సాధనానంతరం,


 ముంబై తెలంగాణ బహుజన ఫోరం (MTBF) కు  అడ్వైజర్ గా బహుజనోద్యమంలో శివాజీ మహారాజ్, జీజావు, సావిత్రి, జ్యోతిబా ఫూలే, డా.అంబేడ్కర్, సంత్ గాడ్గే బాబా, ప్రభోధకర్ ఠాక్రే, చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్న గౌడ్, విఠల్ సాయన్న యాదవ్, కొండ లక్ష్మన్ బాపూజీ తదితర బహుజన మహానీయుల జయంతులు వర్ధంతులు నిర్వహించేవారు పాల్గొనేవారు. ఆయన అవార్డులు, అనేక సన్మానాలు పొందారు.


 


ఆయన బాల్య దశలోనే వరంగల్ జిల్లా జనగం మండలం అమ్మలబోల్ గ్రామం నుండి వారి తల్లిదండ్రులతో ముంబై మహానగరానికి వలస వచ్చారు. తాను చదువుకుంటు టేలర్ పని చేసుకునేవారు. జి. రాందాస్ పద్మశాలి గారు విచార జాగృతి అనే మరాఠీ హిందీ తెలుగు త్రైమాసిక పత్రిక నడిపేవారు,  9 మార్చ్ 2014 రోజున తెలంగాణ జర్నలిస్టుల జాతర లో కూడా పాల్గొన్నారు.


 


తాను నాలుగుసార్లు ముంబై స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీలోకి దిగారు. మున్సిపల్ పాఠశాలల్లో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చేయాలని, గరీబ్ విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మాధ్యమం చేయాలని కృషి చేశారు.


 


మూల్ నివాసి మాల : 9869010890